Fri Dec 05 2025 18:40:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆయిల్‌పామ్ చెట్లను సెలైన్ తో కాపాడుకుంటూ
ఆయిల్ పామ్ చెట్లను సాగు చేయడం అంత ఆషామాషీ కాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి.

ఆయిల్ పామ్ చెట్లను సాగు చేయడం అంత ఆషామాషీ కాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురానికి చెందిన రైతు పాషా ప్రస్తుతం అలాంటి పనే చేస్తున్నారు. ఆయన ఆయిల్‌పామ్ తోటలో చెట్లకు గానోడెర్మా తెగులు సోకింది. దీంతో వేరు, కాండం దెబ్బతింటోంది. దీంతో చెట్లను కాపాడడానికి ఆయన సెలైన్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆయిల్‌పామ్ చెట్టుకు రంధ్రం చేసి 200 ఎంఎల్ నీటిలో హెక్సాకోనజోల్‌ను 20 ఎంఎల్ కలిపి సెలైన్ ద్వారా కాండానికి అందిస్తున్నారు. ఈ చికిత్సతో మొక్క చనిపోకుండా సాధారణ స్థితికి తీసుకురావచ్చట.
News Summary - Protecting oil palm trees with saline
Next Story

