Sat Mar 07 2026 21:57:09 GMT+0530 (India Standard Time)
Ramoji Rao : రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం
ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. రామోజీరావు మృతి తనకు దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి జర్నలిజానికి లోటు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి ఆయన పార్ధీవ దేహాన్ని సందర్శించనున్నారు.
అనేక మంది...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీరావు మృతి పట్ల తనకు దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన జర్నలిజానికి చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. రామోజీరావు చేసిన సేవలు ఎందరికో స్పూర్తిదాయకమని తెలిపారు. రామోజీ రావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో రామోజీరావు మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. ఉదయాన్నే ఈ వార్త తనకు దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్షర యోధుడికి కన్నీటి నివాళులంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
Next Story

