Wed Mar 25 2026 12:50:20 GMT+0530 (India Standard Time)
విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి
విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి లభించింది

విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి లభించింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకు వస్తున్నారు. 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏడు రాష్ట్రాల్లో సోదాలు...
ఇుదులో బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏడు రాష్ట్రాల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ, బెంగాల్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తీసుకు వస్తున్నారు.
Next Story

