Sun Mar 15 2026 07:36:44 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఎమ్మెల్యేలతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు నేడు బడ్జెట్ పై అవగాహన కల్పించే కార్యక్రమం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు నేడు బడ్జెట్ పై అవగాహన కల్పించే కార్యక్రమం జరగనుంది. ఉదయం పది గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో ఎమ్మెల్యేలకు బడ్జెట్ పై అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఈ అవగాహన కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. బడ్జెట్ పైనా, అసెంబ్లీ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు.
ఎన్డీఏ కూటమి నేతలతో...
సీనియర్ నేతలతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సమావేశంలో పాల్గొని సభ్యుల సందేహాలకు సమాధానమిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెెండు గంటలకు ఎన్డీఏ కూటమి పార్టీల శాసనసభ్యుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లన కూడా నేడు ఖరారు చేసే అవకాశముంది. కూటమి నుంచి ప్రతి ఎమ్మెల్యే హాజరు కావాలని కూటమి పార్టీలు ఆదేశాలు జారీ చేశాయి.
Next Story

