Sun Mar 08 2026 14:01:35 GMT+0530 (India Standard Time)
విదేశాలకు తారకరత్నను తీసుకెళ్లే యోచన
నటుడు తారకరత్నను విదేశాలకు తీసుకు వెళ్లే యోచనలో కుటుంబ సభ్యులున్నట్లు ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ తెలిపారు.

నటుడు తారకరత్నను విదేశాలకు తీసుకు వెళ్లే యోచనలో కుటుంబ సభ్యులున్నట్లు ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ తెలిపారు. నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఆయన పరామర్శించారు. వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి ఆయన పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
రిపోర్టులను బట్టి....
తారకరత్న మెదడుకు స్కానింగ్ తీశారని, రిపోర్టులు వచ్చిన తర్వాత దాని ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుందని తెలిపారు. పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారని ఆయన చెప్పారు. బాలకృష్ణ ఆయన ఆరోగ్యపరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు. తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story

