Sun Mar 08 2026 11:08:39 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారన్నారు

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ డిమాండ్లు నెరవేరలేదన్న ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. పీఆర్సీ, జీతభత్యాల విషయంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందని తెలిపారు. అయినా వైసీపీ ప్రభుత్వానికి వచ్చే సమస్య ఏమీ లేదని తెలిపారు.
ఉపాధ్యాయులు అసంతృప్తి...
లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల చేత వైసీపీకి ఓటు వేయిస్తే మళ్లీ జగన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణను విస్మరించకూడదని, విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన పిలుపు నిచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధమని రాచమల్లు సవాల్ విసిరారు. ప్రజలు తిరిగి వైసీపీని ఆశీర్వదిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు
Next Story

