Tue Mar 31 2026 10:17:36 GMT+0530 (India Standard Time)
బెజవాడలో ప్రైవేట్ బస్సులో మంటలు
బెజవాడలో ప్రైవేట్ బస్సులో మంటలు అంటుకున్నాయి

బెజవాడలో ప్రైవేట్ బస్సులో మంటలు అంటుకున్నాయి. అయితే ఈ బస్సు ప్రమాదంలో అందరూ బతికి బయట పడ్డారు. పెను ప్రమాదం తప్పినట్లయింది. రావులపాలెం నుంచి హైదరాబద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
తప్పిన ప్రమాదం...
బెజవాడ బస్టాండ్ దగ్గరకు వచ్చాక మంటలు చెలరేగడంతో ప్రయానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. అప్రమత్తమై మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారరు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

