Wed Feb 04 2026 11:53:03 GMT+0000 (Coordinated Universal Time)
నవంబరు 11న విశాఖకు ప్రధాని
నవంబరు 11న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు

నవంబరు 11న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపడుతున్నారు.
బహిరంగ సభకు...
విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారని తెలిపింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మినిట్ టు మినిట్ కార్యక్రమం త్వరలోనే విడుదల కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story
