Sat Mar 21 2026 14:38:58 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో భీమవరానికి మోదీ
నేడు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

నేడు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి గన్నవరం విమనాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
భారీ భద్రత...
మోదీకి ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ విశ్వభూషణ్ స్వాగతం పలకలనున్నారు. భీమవరంలో జరిగే సభకు లక్ష మంది ప్రజలు వచ్చే లా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎస్పీజీ టీం మోదీ పర్యటించే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. మూడు వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story

