Mon Jan 19 2026 23:44:37 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : రేపు ఆంధ్రప్రదేశ్ కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు

ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయననేషనల్ అకాడీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను మోదీ సందర్శించనున్నారు. తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. ఇప్పటికే భద్రతాదళాలు ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.
ప్రధాని పర్యటన కోసం...
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సత్యసాయి జిల్లాకు రానున్నారు. ఆయనతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ఇతర అధికారులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ కార్మికులతో కూడా ఆయన సంభాషిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

