Sun Jan 12 2025 22:05:51 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : మూడు రోజులు ఏపీలోనే మోదీ మకాం
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 16వ తేదీన విశాఖలోని రైల్వే మైదానంలో నిర్వహించనున్న సభలో ప్రధాని పాల్గొంటారని స్థానిక బీజేపీ నాయకులు వెల్లడించారు. 17వ తేదీన చిలకలూరిపేట వద్ద జరగనున్న మూడు పార్టీల ఉమ్మడి సభలో ఆయన పాల్గొనే అవకాశముంది.
షెడ్యూల్ అధికారికంగా...
మోదీ ఏపీలో మూడు రోజుల పాటు పర్యటిస్తుండటంతో ఏపీ రాజకీయాలు మరింత హీట్ కానున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారయిన తర్వాత తొలిసారి మోదీ ఏపీకి వస్తున్న సందర్భంగా ఆయన పర్యటనలో ప్రసంగాలు ఏరకంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మూడురోజుల మోదీ పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ అధికారికంగా రావాల్సి ఉంది
Next Story