Fri Dec 05 2025 14:16:06 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెల 4న మంగళగిరి ఎయిమ్స్ కు మోదీ
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 4న మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 4వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. విశాఖ, భీమవరం జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లోనూ పాల్గొంటారు. తాజాగా మోదీ మంగళగిరిలోని ఎయిమ్స్ ను ప్రారంభిస్తారు.
మూడు ప్రాంతాల్లో....
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. మోదీ చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆయనను అన్ని ప్రాంతాల్లో పర్యటించేలా రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ఎన్నికలు దగ్గరపడే సమయంలో మోదీ పర్యటన తమకు ఉపయోగకరంగా మారుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
Next Story

