Thu Mar 19 2026 03:14:05 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు ఏపీకి ప్రధాని మోదీ రాక.. రెండు సభల్లో
నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు

నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నరేంద్ర మోదీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ రాజమండ్రి, అనకాపల్లి ప్రచార సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి ఏర్పడిన తర్వాత మోదీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.
కూటమి అభ్యర్థులకు మద్దతుగా...
తొలుత రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంద్రీశ్వరికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. వేమగిరిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. అందులో మోదీ పాల్గొంటారు. సాయంత్రం అనకాపల్లికి చేరుకుని అక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పాల్గొంటారు.
Next Story

