Sun Mar 22 2026 01:40:40 GMT+0530 (India Standard Time)
మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ విశాఖకు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ విశాఖకు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 11, 12 తేదీల్లో మోదీ విశాఖలో పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు మోదీకి ఈ నెల 11న సాయంత్రం స్వాగతం పలకనున్నారు.
10,475 కోట్ల విలువైన...
ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. అనంతరం ఆయన విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో మొత్తం 10,475 కోట్ల విలువైన పనులకుశంకుస్థాప చేయనున్నారు. ఏడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మోదీ రెండు రోజుల పర్యటన పూర్తిగా అధికారిక పర్యటన మాత్రమేనని ఆయన తెలిపారు.
Next Story

