Wed Feb 04 2026 10:17:26 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ ఏపీ పర్యటనపై ఆసక్తి.. ఆ ప్రకటన చేస్తారా?
ప్రధాని మోదీ ఈ నెల 11వ తేదీన విశాఖకు రానున్నారు. ఆయన విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన విశాఖకు రానున్నారు. ఆయన విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోదీ ఈ పర్యటనలో కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. విశాఖ రైల్వే జోన్ ను ఈ కార్యక్రమంలో మోదీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిసింది.
రైల్వే జోన్ కు...
ఉత్తరాంధ్రకు విశాఖ రైల్వే జోన్ ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. కొందరు విశాఖ రైల్వే జోన్ లేదని పనిగట్టుకుని ప్రచారం చేశారు. అయితే వీటిన్నింటికీ చెక్ పెడుతూ మోదీ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొననున్నారు.
బహిరంగ సభలో...
అనంతరం అక్కడ నుంచి తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఈఎన్సీ అధికారులత సమావేశం అవుతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఆంధ్రయూనివర్సిటీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

