Sun Mar 08 2026 00:32:56 GMT+0530 (India Standard Time)
మోదీకి రఘరామ లేఖ.. తనను బెదిరించారంటూ?
ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తనన కొందరు వైసీపీ ఎంపీలు బెదరించారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తాను పార్లమెంటు కారిడార్ లో వెళుతుండగా కొందరు వైసీపీ ఎంపీలు తనను చంపుతామని బెదిరించినట్లు రఘురామ కృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. ఇందులో ఎంపీ నందిగం సురేష్ పేరు ప్రస్తావించినట్లు తెలిసింది.
రైతుల సభకు...
మరోవైపు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి రైతుల సభకు పోలీసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు సభ పెట్టుకుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. రాజధాని రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.
Next Story

