Thu Mar 19 2026 04:41:44 GMT+0530 (India Standard Time)
Narendra Modi : లాస్ట్ బాల్ వేసేందుకు వస్తున్న మోదీ.. ఇక కాచుకో జగన్
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది. మే 6, 8 తేదీల్లో ప్రధాని ఏపీలో పర్యటించనున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని ప్రచారాన్ని నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోడ్ షోలతో పాటు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడనున్నారు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో చివరి సమయంలో మోదీ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూటమికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
రాజమండ్రి నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో జరిగే బహిరంగ సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే ఆరో తేదీన నేరుగా రాజమండ్రికి చేరుకుని అక్కడ వేమగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. పురంద్రీశ్వరి, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం అనకాపల్లిచేరుకుని అక్కడి బహిరంగ సభలో పాల్గొంటటారు. మే 8వ తేదీన పీలేరు నియోజకవర్గం సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో జరిగే రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

