Thu Mar 19 2026 07:35:13 GMT+0530 (India Standard Time)
Narendra Modi : ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం ఇలా
ఆంధప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయింది. మూడు, నాలుగు తేదీల్లో ఆయన ఏపీలో పర్యటించనున్నారు

ఆంధప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయినట్లు తెలిసింది. మూడు, నాలుగు తేదీల్లో ఆయన ఏపీలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడో తేదీన పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. నాలుగో తేదీన రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని చెబుతున్నారు.
బెజవాడలో రోడ్ షో...
3వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 4వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి లో జరిగే ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

