Sat Nov 08 2025 00:13:14 GMT+0000 (Coordinated Universal Time)
19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా యూనివర్సటిటీ స్నాతకోత్సవం ఈ నెల జరగనుంది. ఈ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తి సిద్ధమయింది. ఈ నెల 13వ తేదీ నుంచి పుట్టపర్తి లో సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
22న ఉప రాష్ట్రపతి...
ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న పుట్టపర్తి సత్యసాయి బాబా ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కానుండటంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంతో కలసి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
Next Story

