Thu Jan 29 2026 07:21:41 GMT+0000 (Coordinated Universal Time)
కేజీ టమాటా రెండు రూపాయలు
ఆంధ్రప్రదేశ్లో టమాటా ధర దారుణంగా పడిపోయింది. కేజీ టమాటా ధర రెండు రూపాయలు పలుకుతుంది

ఆంధ్రప్రదేశ్లో టమాటా ధర దారుణంగా పడిపోయింది. కేజీ టమాటా ధర రెండు రూపాయలు పలుకుతుంది. మదనపల్లె మార్కెట్లో ముప్ఫయి కిలోల టమాటా బాక్స్ ధర వ్యాపారులు కేవలం అరవై రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ కు టమాటా తెచ్చిన రైతులు అక్కడే వదిలి వెళ్లిపోతున్నారు.
పెట్టుబడి ధర...
అలాగే టమాటా ధర పూర్తిగా పడిపోయిందని తెలుసుకుని పొలాల్లోనే పశువుల మేతగా వినియోగిస్తున్నారు. కొందరు ఆరుబయట టమాటాను పారబోస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది టమాటా ధర ఇలాగే పడిపోతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడంలేదని రైతులు అంటున్నారు. మరో వైపు దిగుబడి అధికంగా రావడంతోనే ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
- Tags
- tomato
- two rupees
Next Story

