Sun Mar 15 2026 18:03:33 GMT+0530 (India Standard Time)
ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర
టమాటా ధర దారుణంగా పడిపోయింది. మదనపల్లి మార్కెట్ లో టమాటా ధర కిలో ఆరు రూపాయలు ఈరోజు పలికింది.

నిన్న మొన్నటి వరకూ టమాటా ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. కిలో టమాటా ధర రూ.150 లు పలికిన సందర్భం కూడా ఉంది. టమాటా దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో ధర అమాంతం పెరిగిపోయింది. టమాటా ధర ఇప్పుడిప్పుడే దిగి వస్తుంది. మొన్నటి వరకూ కిలో నలభై రూపాయలు పలికిన టమాటా రెండు మూడు రోజుల నుంచి ఇరవై రూపాయలకు చేరుకుంది.
కిలో ఐదు రూపాయలు.....
ఇక ఈరోజు టమాటా ధర దారుణంగా పడిపోయింది. మదనపల్లి మార్కెట్ లో టమాటా ధర కిలో ఆరు రూపాయలు ఈరోజు పలికింది. అదే సమంయలో కర్నూలు ఆస్పరి మార్కెట్ లో అయితే కిలో టామాటా ఐదు రూపాయలే పలికింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొన్నటి వరకూ ఇదే మార్కెట్ లో వంద రూపాయలు పలికిన టమాటా నేడు ఐదు రూపాయలకు చేరుకోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు గిట్టుబాటు కాదని అంటున్నారు.
Next Story

