Sun Mar 15 2026 18:01:44 GMT+0530 (India Standard Time)
రెండు రూపాయలకే టామాటా.. కుప్పకూలిన రైతు
టమాటా ధర దారుణంగా పడిపోయింది. బయట మార్కెట్ లోనే కిలో పదిరూపాయలకు చేరుకుంది

టమాటా ధర దారుణంగా పడిపోయింది. బయట మార్కెట్ లోనే కిలో పదిరూపాయలకు చేరుకుంది. రైతుకు కిలో రెండు రూపాయలు కూడా దక్కడం లేదు. టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దిగుబడి ఎక్కువగా రావడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కూడా ఎక్కువగా ఉండటంతో టమాటా ధర దారుణంగా పడిపోయింది. కిలో రెండు రూపాయలకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు.
మార్కెట్ లోనే....
బయట మార్కెట్ లోనే టామాటా ధర పదిరూపాయలు పలుకుతుంది. మొన్నటి వరకూ వంద నుంచి యాభై రూపాయలు ధర పలకడంతో రైతులు ఎక్కువగా పంట వేశారు. దీంతో దిగుబడి ఎక్కువగా వచ్చింది. మదనపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా రెండు రూపాయలు పలుకుతుంది. వ్యాపారులు నాణ్యతను కూడా పరిశీలించి ఈ ధర చెల్లిస్తున్నారు. దీంతో టమాటా రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Next Story

