Tue Mar 17 2026 05:25:36 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు విశాఖకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే ఉంటారు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు విశాఖకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే ఉంటారు. తిరిగి 22వ తేదీన ఆయన విశాఖ నుంచి బయలుదేరి వెళతారు. విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ రేపు జరగనుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు పాల్గొననున్నారు.
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో....
ఈ నెల 21 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింది ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. రాష్ట్రపతికి స్వాగతం చెప్పేందుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా విశాఖకు చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

