Thu Mar 19 2026 20:52:36 GMT+0530 (India Standard Time)
ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం లభించింది.

సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉన్నారు. హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్రపతిని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
వివిధ కార్యక్రమాల్లో...
శ్రీశైలంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ప్రసాదం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

