Tue Mar 17 2026 02:11:05 GMT+0530 (India Standard Time)
వచ్చే నెల 4న ఏపీకి రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 4వ తేదీన విశాఖకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 4వ తేదీన విశాఖకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. భారత నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా జరగనున్న నేవీ డే విన్యాసాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి పర్యటనను అధికారులు విడుదల చేశారు. వచ్చే నెల 4వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళతారు.
వివిధ కార్యక్రమాలను...
విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఆర్కే బీచ్ కు చేరుకుని నేవీ డే విన్యాసాలను ప్రారంభించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం లోని వివిధ శాఖలకు చెందిన మరికొన్ని ప్రాజెక్టులను రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారి ఏపీలో పర్యటిస్తున్నారు.
Next Story

