Thu Mar 19 2026 19:59:00 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీకి రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు 10.30 గంటలకు ఆమె విజయవాడ చేరుకోనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు 10.30 గంటలకు ఆమె విజయవాడ చేరుకోనున్నారు. అక్కడి నుంచి తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పోరంకి మురళి రిసార్ట్ లో జరిగే పౌర సన్మానంలో ఆమె పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు పాల్గొంటారు.
నేవీ డే...
అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్ లో రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందులో ఆమె పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖపట్నం బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 3.45 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగా చేరుకుని విశ్రాంతి తీసుకుని అనంతరం ఆర్కే బీచ్ చేరుకుంటారు. అక్కడ జరిగే నేవీ ఉత్సవాలతో పాటు పలు అభివృద్ధి, శంకు స్థాపనల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Next Story

