Mon Dec 15 2025 08:57:59 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల17న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ కు రానున్నారు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల17న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో మంగళగిరి ఎయిమ్స్ అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన రావడతో ప్రభుత్వం కూడా ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.
శీతాకాల విడిదిలో భాగంగా...
శీతాకాల విడిదిలో భాగంగా ద్రౌపది ముర్ము ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతిభవన్ లో బస చేయనున్నారు. 17న ఏపీలో పర్యటించి తిరిగి ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. మంగళగిరిలో జరిగే ఎయిమ్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పాల్గొనే అవకాశముందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
Next Story

