Thu Mar 19 2026 04:49:20 GMT+0530 (India Standard Time)
Puttaparthi : నేడు రాష్ట్రపతి పుట్టపర్తి రాక
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తి రానున్నారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తి రానున్నారు. పుట్టపర్తి లో జరిగే వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లి సత్యసాయి మహాసమాధినిన దర్శించుకోనున్నారు.
గోల్డ్ మెడల్స్...
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందచేస్తారు. మొత్తం 21 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందచేయనున్నారు. అనంతరం పుట్టపర్తి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.
Next Story

