Sun Mar 08 2026 02:56:24 GMT+0530 (India Standard Time)
టీడీపీని ఎందుకు పిలవలేదో తెలియదు
విపక్షాల సమావేశానికి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఆహ్వానించలేదో తనకు తెలియదని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు

రెండుసార్లు జరిగిన విపక్షాల సమావేశానికి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఆహ్వానించలేదో తనకు తెలియదని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. టీడీపీ నిర్ణయం తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదన్నారు. టీడీపీ ద్రౌపది ముర్ముకు మద్దతు పలుకుతుందని తనకు ముందే తెలుసునని యశ్వంత్ సిన్హా చెప్పారు. ఆయన నిన్న గౌహతి ప్రచారానికి వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆత్మప్రభోదానుసారం...
తెలుగుదేశం పార్టీ విపక్ష కూటమిలో ఉందా? లేదా? అన్నది తనకు తెలియదన్నారు. అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని, ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని యశ్వంత్ సిన్హా పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తుందన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.
Next Story

