Wed Jan 28 2026 17:46:14 GMT+0000 (Coordinated Universal Time)
బొప్పూడి సభకు ఏర్పాట్లు.. బ్లూబుక్ నిబంధనల మేరకు
ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరగనున్న టీడీపీ కూటమి సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి

ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరగనున్న టీడీపీ కూటమి సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పదమూడు కమిటీలు ఈ సభను విజయవంతం చేయడం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ప్రధాని ఈ సభకు హాజరు కానుండటంతో బ్లూ బుక్ భద్రత నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు హెలిప్యాడ్లు...
రేపు సాయంత్రానికి సభ ప్రాంగణాన్ని తమకు అప్పగించాలని ప్రధాని భద్రతా సిబ్బంది కోరడంతో ఏర్పాట్లను మరింత ముమ్మరం చేశారు. మొత్తం 150 ఎకరాల్లో పది లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. ముగ్గురు నేతల కోసం మూడు హెలిప్యాడ్లను ఇప్పటికే సిద్ధం చేశారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను సమీకరించేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ జరుపుతున్న తొలి సమావేశం కావడంతో ఎన్నికల వేళ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

