Thu Mar 19 2026 05:35:48 GMT+0530 (India Standard Time)
బెజవాడలో కేసీఆర్ బహిరంగ సభ
విజయవాడలో కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే జనవరిలో సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

విజయవాడలో కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి పండగ రోజుల్లో ఈ సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో డిసెంబరు 9వ తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. మధ్యాహ్నం మీడియా సమావేశంలో పార్టీ పేరును కూడా ప్రకటించనున్నారు.
ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం...
ఢిల్లీలో బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే సంక్రాంతి పర్వ దినాల సందర్భంగా విజయవాడ లేదా గుంటూరులలో ఈ సభను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విలేకర్లతో జరిగిన చిట్ చాట్ లో తెలిపారు. పొరుగు రాష్ట్రమైన ఏపీ నుంచి కూడా బీఆర్ఎస్ కు మద్దతు పొందేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియవచ్చింది.
Next Story

