Sat Jan 31 2026 21:48:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక సమావేశం.. కార్యాచరణ సిద్ధం
చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంతో ఉద్యోగ లోకం ఉత్సాహంలో ఉంది. కార్యాచరణను రూపొందించేందుకు ఈరోజు సమావేశం కానుంది.

చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంతో పీఆర్సీ సాధన సమితి ఉత్సాహంలో ఉంది. కార్యాచరణను రూపొందించేందుకు ఈరోజు సమావేశం కానుంది. రేపటి నుంచి సహాయ నిరాకరణ చేయనున్నారు. ఎల్లుండి అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నారు. మంత్రుల కమిటీతో ఇక చర్చలకు వెళ్లేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. కేవలం ముఖ్యమంత్రితో మాత్రమే తామ చర్చలు జరుపుతామంటున్నాయి.
సమ్మెకు వెళ్లే లోపు....
ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే పీఆర్సీ సాధన సమితి సమావేశంలో చర్చల విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. సమ్మెకు వెళ్లేముందు ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే చర్చలకు వెళ్లాలని నిర్ణయించే అవకాశముంది. ప్రస్తుతం తాము పెట్టిన మూడు డిమాండ్లను నెెరవేరిస్తేనే చర్చలకు వెళ్లాలని నిర్ణయించనున్నారు. ప్రజారోగ్యం, ఆర్టీసీ, విద్యుత్తు వంటి శాఖలను కలుపుకుని 7 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఈరోజు జరిగే సమావేశంలో పీఆర్సీ సాధన సమితి సభ్యులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story

