Thu Mar 19 2026 05:57:36 GMT+0530 (India Standard Time)
మళ్లీ ఏపీకి ప్రవీణ్ ప్రకాష్
ప్రవీణ్ ప్రకాష్ ను తాజాగా రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.

కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి జగన్ కు దగ్గరగా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కొన్ని బలమైన కారణాలతో ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించింది. అయితే ఆయనను తిరిగి ఏపీకి తీసుకు వస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ ప్రకాష్ ను తాజాగా రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఏపీ భవన్ రెసిడెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ గా మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఇన్ ఛార్జి సీఎస్ గా...
అలాగే మరో సీనియర్ అధికారి వీరపాండ్యన్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. దీంతో పాటు మార్క్ఫెడ్ జేఎండీ గా కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆదిత్యానాథ్ దాస్ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఏపీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఇన్ ఛార్జి బాధ్యతలను విజయానంద్ కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story

