Fri Mar 20 2026 03:16:25 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేత గుండెపోటుతో మృతి
ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరుపుల రాజా గుండెపోటుతో మరణించారు

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరుపుల రాజా గుండెపోటుతో మరణించారు. ఆయనకు నిన్న రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో రాత్రి 11 గంటలకు అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దీంతో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
ప్రచారంలో పాల్గొని...
వరుపుల రాజా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గత కొద్ది రోజులుగా ప్రచారం లో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావుకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం ప్రచారం నుంచి వచ్చిన ఆయన ఛాతీలో నొప్పి రావడంతో ఈసీజీ కూడా తీయించారు. వెంటనే కాకినాడ ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించడంతో కారులో తీసుకు వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వరుపుల రాజాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈరోజు వరుపుల రాజా భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story

