Sat Mar 07 2026 17:39:53 GMT+0530 (India Standard Time)
ప్రైవేట్ ఫ్లైట్ లో వచ్చి.. జస్ట్ మర్యాదపూర్వకంగా కలిశారట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రశాంత్ కిషోర్ మీటింగ్ ముగిసింది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రశాంత్ కిషోర్ మీటింగ్ ముగిసింది. చంద్రబాబు నాయుడు దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకులని.. అందుకే ఆయనను కలవడానికి వచ్చానని అన్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించారని చెబుతున్నారు.
ప్రైవేట్ ఫ్లైట్ లో రాక:
ప్రశాంత్ కిషోర్ ప్రైవేట్ ఫ్లైట్‌లో లోకేశ్ వెంట విజయవాడకు వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరపడానికే వచ్చారు. లోకేశ్, ప్రశాంత్ కిషోర్ వచ్చిన ప్రైవేట్ ఫ్లైట్.. రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినది. ఈ కంపెనీ బీజేపీ నేత సీఎం రమేష్, ఆయన తనయుడు రిత్విక్ పేరున ఉంది.
Next Story

