Wed Oct 16 2024 05:13:52 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada KanakaDurga ఆ అక్రమాలపై సాక్ష్యాలున్నాయి.. ఎక్కడైనా చర్చకు సిద్ధమే: పోతిన మహేశ్
ఈ అక్రమాలపై ఆధారాలతో సహా చర్చకు ఏ వేదిక మీదనైనా సిద్ధమే
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అవినీతి జరుగుతోందని, టీడీపీ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ ఆరోపించారు. అమ్మవారి ఆలయంలో మూడు నెలల్లోనే రూ.4కోట్ల సొమ్మును కొట్టేశారని అన్నారు, పార్కింగ్, టోల్ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దె పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ సిద్ధమయ్యారని.. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అని ఆరోపించారు పోతిన మహేశ్. దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి మరీ టీడీపీ నాయకులు జీవోలు జారీ చేయించుకుంటున్నారని, నాలుగు నెలల పాటు భక్తుల నుంచి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ అక్రమాలపై ఆధారాలతో సహా చర్చకు ఏ వేదిక మీదనైనా సిద్ధమే అని అన్నారు. అమ్మవారి ఆలయంలో జరిగే అక్రమాలపై పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కనకదుర్గ నగర్లో షాపుల ఏర్పాటులోనూ అక్రమాలకు తెరతీశారని పోతిన మహేశ్ విమర్శించారు. బకాయిలు ఉన్నా, వ్యాపారాలు సజావుగా సాగుతున్నా కూడా 49 శాతం అద్దెలను తగ్గించారన్నారు. ఇందుకోసం బుద్ధా వెంకన్న ఒక్కో దుకాణానికి రూ.5లక్షల చొప్పున లంచం తీసుకున్నారని ఆరోపించారు. విజయవాడ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీతో విచారణ జరిపించాలని పోతిన మహేశ్ డిమాండ్ చేశారు.
Next Story