Fri Dec 05 2025 22:21:49 GMT+0000 (Coordinated Universal Time)
బిషప్ ఉడుముల బాలాను ఆర్చ్ బిషప్ గా నియమించిన పోప్
ప్రస్తుతం వరంగల్ బిషప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిషప్ ఉడుమల బాలాను

హైదరాబాద్: ప్రస్తుతం వరంగల్ బిషప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిషప్ ఉడుమల బాలాను విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా పోప్ ఫ్రాన్సిస్ నియమించారు. ఆర్చ్ డియోసెస్ నాయకత్వంలో ఈ మార్పు చోటు చేసుకుంది.
ఉడుముల బాలా నేపథ్యం:
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ఘన్ పూర్ లో బిషప్ ఉడుముల బాలా జన్మించారు. ఫిబ్రవరి 20, 1979లో ప్రీస్ట్ గా బాధ్యతలు స్వీకరించారు. రోమ్‌లోని అల్ఫోన్సియన్ అకాడమీ నుండి మోరల్ థియాలజీలో డాక్టరేట్ సొంతం చేసుకున్నాడు. వరంగల్ డియోసెస్ లో పాస్టర్ గానూ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఆయన కీలక బాధ్యతలను చేపట్టారు.
విద్యార్హతలు, అడ్మినిస్ట్రేటివ్ విభాగం:
1994 నుండి 2006 వరకు, బిషప్ బాలా హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో మోరల్ థియాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అక్కడ ఆయన 1997 నుండి 2006 వరకు రెక్టార్‌గా కూడా పనిచేశారు. 2006లో, బెంగుళూరులోని బిషప్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్‌కి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు. 2013లో ఆయన బిషప్ ఆఫ్ వరంగల్ గా బాధ్యతలు చేపట్టారు.
ఎపిస్కోపల్ మినిస్ట్రీ
పోప్ ఫ్రాన్సిస్ చేత ఏప్రిల్ 13, 2013న వరంగల్ బిషప్‌గా నియమితులైన బిషప్ బాలా మే 23, 2013న కాన్సీక్రేటెడ్ అయ్యారు. ఆయన పదవీ కాలంలో డియోసెస్‌లో మతసంబంధమైన సంరక్షణ, విద్య, సామాజిక సేవలపై దృష్టి సారించారు.
విశాఖపట్నం ఆర్చ్ డియోసెస్ కొత్త నాయకత్వం కోసం వేచి ఉంది. బిషప్ బాలా నియామకం కొత్త శక్తిని తీసుకువస్తుందని భావిస్తున్నారు. థియోలాజీ, విద్య, పరిపాలనలో బిషప్ బాలాకు ఉన్న విస్తృత అనుభవం ఆర్చ్ డియోసెస్ నాయకత్వంలో కొత్త మార్పులను తీసుకుని వస్తుంది.
విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా బిషప్ బాలా బాధ్యతలు చేపట్టాక.. విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలకు అంకితమైన అనేక సంస్థలను పర్యవేక్షిస్తారు. ఆర్చ్ డియోసెస్ విశ్వాసులు రాబోయే సంవత్సరాల్లో ఆయన నాయకత్వం, మతసంబంధమైన మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నియామకం విశాఖపట్నం ఆర్చ్‌డియోసెస్‌ను ఆధ్యాత్మిక అభివృద్ధి, సమాజ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కించనుంది. ఈ నియామకం బిషప్ బాలా సామర్థ్యాలపై పోప్ ఫ్రాన్సిస్‌కు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
Next Story

