Sun Mar 15 2026 08:54:41 GMT+0530 (India Standard Time)
అదనపు అడ్వొకేట్ జనరల్ పదవికి పొన్నవోలు రాజీనామా
ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ పదవికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు

వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో ముఖ్యమైన పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ పదవికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి అందించారు. వైసీపీ ప్రభుత్వంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదనపు అడ్వొకేట్ జనరల్ గా వ్యవహరించి పలు కేసుల్లో కీలక వాదనలను వినిపించారు.
అధికారం మారడంతో...
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం, కొత్త ప్రభుత్వం రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డిలు కూడా తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన మరికొందరు కూడా రాజీనామా చేయనున్నారు. అయితే ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండటంతో ఏజీపీలు, ఏపీపీలు కూడా కొద్ది రోజుల తర్వాత రాజీనామా చేయనున్నారు.
Next Story

