Thu Dec 18 2025 10:06:52 GMT+0000 (Coordinated Universal Time)
కడపలో భారీ బందోబస్తు... కారణమదే
కడప జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమయింది. పోలింగ్ కేంద్రాలకు ప్రజలు భారీగానే తరలి వస్తున్నారు.

కడప జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమయింది. పోలింగ్ కేంద్రాలకు ప్రజలు భారీగానే తరలి వస్తున్నారు. కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
టెన్షన్ నెలకొనడంతో.....
కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీల్లో వైసీపీ, టీడీపీ పోటీ చేస్తుండటంతో గత కొంత కాలంగా టెన్షన్ నెలకొంది. దీంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఈనెల 17 వ తేదీన దీనికి సంబంధించి కౌంటింగ్ జరగనుంది.
- Tags
- kadaa
- kamalapuram
Next Story

