Fri Dec 05 2025 22:47:19 GMT+0000 (Coordinated Universal Time)
రేపు పులివెందుల ఉప ఎన్నిక
రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు పథ్నాలుగు మంది పోలీసులతో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు పదకొండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పదిహేను పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రెండు ఉప ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఏర్పాట్లు పూర్తి...
దాదాపు ముప్ఫయి పోలింగ్ కేంద్రాల్లో 24 వేల మంది ఓటర్లను తమ ఓటు హక్కును ఓటు వేయనున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట రెండు మండలాలల్లో రేపటి నుంచి జరిగే జడ్పీటీసీ ఎన్నికలకు ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు అంద చేస్తారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 700 మంది పోలీసులతో బందోబస్తు, ఒంటిమిట్టలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రెండు మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరించారు.
News Summary - polling for the pulivendula and ontimitta zptc elections will be held tomorrow. police have made heavy security arrangements
Next Story

