Mon Mar 16 2026 02:42:12 GMT+0530 (India Standard Time)
కుప్పంలో ప్రారంభమయిన పోలింగ్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కు ఎన్నిక జరగనుంది.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కు ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ప్రధానంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. కుప్పం లో గెలుపు తమదేనని ఇరు పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
నెల్లూరులో కూడా...
మరోవైపు నెల్లూరు కార్పొరేషన్ కు కూడా నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తలపడుతున్నాయి. వీటితో పాటు మరో పదకొండు మున్సిపాలిటీలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
Next Story

