Fri Jan 17 2025 08:34:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నిక ముగిసింది.. పోలింగ్ శాతం ఎంతంటే?
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకూ 61,75 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు చెప్పారు
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకూ 61,75 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్ల లో ఉన్న వారందరికీ ఓటింగ్ కు అనుమతిస్తారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోనే క్యూలైన్లలో ఓటర్లు ఉన్నారు.
26న కౌంటింగ్...
ఎక్కువ భాగం పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలను మూసివేశారు. ఈవీఎం బాక్సులను ప్యాక్ చేసి తీసుకు వెళ్లే ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 26వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక కౌటింగ్ జరగనుంది. వైసీపీ ఈ ఎన్నికల్లో లక్ష మెజారిటీని సాధించాలన్న లక్ష్యంతో ఉంది. అయితే ప్రస్తుత మెజారిటీని చూస్తే అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది సందేహమే
Next Story