Fri Dec 05 2025 15:37:44 GMT+0000 (Coordinated Universal Time)
ప్రారంభమయిన ఆత్మకూరు పోలింగ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
26న ఫలితాలు...
ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,338 ఓటర్లుండగా ఇందుకోసం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 131 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భారీ యెత్తున పోలీసు బలగాలను మొహరించారు. మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల ఫలితాల విడుదల కానున్నాయి.
Next Story

