Tue Jul 08 2025 16:59:50 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : ఏపీలో రప్పా రప్పారాజకీయం.. సిల్వర్ స్క్రీన్ పై నుంచి పొలిటికల్ డైలాగుల్లా మారి?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు రోజూ హీటెక్కుతున్నాయి. ఎన్నికలయి ఏడాది పూర్తి కాక ముందే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలయిం

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు ప్రతి రోజూ హీటెక్కుతున్నాయి. ఎన్నికలయి ఏడాది పూర్తి కాక ముందే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలయింది. 2019లో టీడీపీ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఇంతే.ఏడాదిలోనే అప్పుడు కూడా రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల వరకూ కొనసాగాయి. ఇప్పడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా పర్యటనతో మరింత హీటెక్కాయి. రప్పా రప్పా రాజకీయాలు నడుస్తున్నాయి. పుష్ప సినిమాలో డైలాగులు నేరుగా పొలిటికల్ స్క్రీన్ పై ప్రత్యక్ష్యమవుతున్నాయి. మాటల యుద్ధం మొదలయింది. ఇద్దరు ఎవరికి వారు తగ్గేదిలేదు అన్నట్లుగానే చంద్రబాబు, జగన్ వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా యువతను ఆకట్టుకునేందుకు ఇలాంటి నినాదాలతో నేతలు ముందుకు వెళుతున్నారా? అన్నఅనుమానం అందిరిలోనూ కలుగుతుంది.
సోషల్ మీడియావార్...
జగన్ పల్నాడు జిల్లాలో పర్యటనలో ఇద్దరు మరణించారని, వారి మృతి జగన్ కారణమని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు కందుకూరులో,గుంటూరులో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో అమాయకులు మరణించిన విషయాన్ని వైసీపీ నేతలు తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా గుర్తు చేస్తున్నారు. నాడు ఇరుకు సందుల్లో పెట్టి జనం వచ్చారని నమ్మించే ప్రయత్నం చేయబట్టే కందుకూరులో అంత మంది మరణించడానికి కారణమని నాడు అధికారంలో ఉన్న వైసీపీ చెప్పి రాష్ట్రమంతటా సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తే, నేడు జగన్ పర్యటనపై ఆంక్షలు విధిస్తూ మూడు వాహనాలకు, వందమందికిమించి వెళ్లడానికి వీలు లేదని చెబుతోంది.
అధికారంలో ఎవరున్నా...
నాడు జగన్ అయినా నేడు చంద్రబాబు అయినా ఒకటే లక్ష్యం. సభలకు, సమావేశాలకు, పర్యటనలకు ఎక్కువ మంది జనం వచ్చినట్లు కనపడితే అది సామాన్య ప్రజలపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన కట్టడి చేయడానికి కారణమంటున్నారు. ప్రధానంగా ప్రధాన మీడియా మరుగున పడిపోయి సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన నేటి కాలంలో పర్యటనలకు హైప్ రావడం ఇష్టం లేకనే ఇలాంటి అనవసర ఆంక్షలు పెడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నాడు జగన్ ఏపీలో రాజకీయ సభలు, సమావేశాలకు ఏకంగా ఒక జీవోను విడుదల చేశారు. దానిపై అప్పట్లో చంద్రబాబు న్యాయపోరాటం చేశారు.నేడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదేరకమైన ఆంక్షలు విధిస్తుండటంతో ఏపీ పాలిటిక్స్ నిజంగానే రప్పా రప్పాగానే నడుస్తున్నాయంటున్నారు. ఇద్దరిలో ఎవరూ సుద్దపూసలు కాదు. పుణ్యాత్ములు కాదన్నది సామాన్యుల మాటగా వినిపిస్తుంది.
తప్పు కాదన్న జగన్.. తప్పేనన్న బాబు...
ఇక వైసీపీ అధికారంలోకి రాగానే జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్పారప్పా నరికేస్తామంటూ జగన్ పల్నాడు పర్యటనలో ఫ్లెక్సీలు వెలిశాయి.అయితే ఆ ఫ్లెక్సీపట్టుకుంది గతంలో టీడీపీ కార్యకర్త అని వైసీపీనేతలు చెబుతున్నారు. అసలు రప్పా రప్పా అంటూ పుష్పసినిమాడైలాగు చెబితే తప్పేంటి.. అడ్డంగా తల అటు ఇటూ ఊపినా కేసులు పెట్టడం కామన్ అయిందని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఇదేమి రాజకీయం అంటూ ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇస్తూ నాయకులకు హుందాతనం ఉండాలని, ఒకవైపు యోగా డే వేడుకలు జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారన్నానిఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లను బలి ఇచ్చేటప్పుడు రప్పా రప్పా అనేవారని, ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మొత్తం మీద ఏపీలో రప్పా రప్పారాజకీయం ఎటువైపు దారి తీస్తుందోచూడాలి.
Next Story