Thu Mar 19 2026 01:08:28 GMT+0530 (India Standard Time)
గుడివాడలో నేడు హోరాహోరీ
గుడివాడలో నేడు రాజకీయ రాద్ధాంతం జరగనుంది. టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా సభలు ఏర్పాటు చేసుకున్నాయి.

గుడివాడలో నేడు రాజకీయ రాద్ధాంతం జరగనుంది. టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా సభలు ఏర్పాటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు గుడివాడలో జరగనున్న రా కదలిరా సభలో పాల్గొననున్నారు. ఆయన సభను విజయవంతం చేసేందుకు పెద్దయెత్తున కార్యకర్తలు గుడివాడకు చేరుకుంటారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు ఈరోజు గుడివాడలో పర్యటించనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దయెత్తున ప్రజలు పాల్గొననున్నారు.
నాని ఆధ్వర్యంలో...
ఇటు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పెద్దయెత్తున నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలను కొడాలి నాని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు కూడా అన్నదానాలతో పాటు అనేక రకాలైన కార్యక్రమాలను ఆయన చేయనున్నారు. రెండు పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు ఇప్పటికే గుడివాడ నిండా వెలిశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ గుడివాడలో నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

