Sat Jan 10 2026 22:50:55 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరు జిల్లాలో టెన్షన్.. వైసీపీ నేతల అరెస్ట్
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలనకు వెళ్లనున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేసినందున సోమశిల రిజర్వాయర్ కు రావాల్సిన నీరు చేరడం లేదని, అక్కడి రైతులతో మాట్లాడేందుకు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు సోమశిల రిజర్వాయర్ సందర్శనకు పిలుపు నిచ్చారు.
సోమశిల సందర్శనకు...
అయితే ఈ సందర్శనకు అనుమతి లేదని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అనుమతి లేదని చెప్పి నెల్లూరు జిల్లా నేత కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం ఇంటికి పంపారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సోమశిల ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది
Next Story

