Fri Dec 05 2025 10:27:45 GMT+0000 (Coordinated Universal Time)
కాకాణి గోవర్థన్ రెడ్డి విచారణ నేడు రెండో రోజు
నేడు రెండో రోజు మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణ చేయనున్నారు.

నేడు రెండో రోజు మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణ చేయనున్నారు. నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కాకాణి గోవర్థన్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారు కేసులో కస్టడీకి తీసుకుని కాకాణి గోవర్ధన్ రెడ్డిని నేడు అధికారులు ప్రశ్నించనున్నారు.
ప్రభుత్వ భూముల రికార్డుల...
ప్రభుత్వ భూముల రికార్డుల తారుమారు కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ14 నిందితుడిగా ఉన్నారు. నిన్న కాకాణిని సిట్ అధికారులు 26 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అందుతోంది. అయితే కాకాణి గోవర్థన్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని తెలిసింది. అన్ని ప్రశ్నలకు ఒకే జవాబు ఇస్తున్నారని అధికారులు తెలిపారు. తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు అంటూ కాకాణి గోవర్థన్ రెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది.
Next Story

