Sat Sep 07 2024 12:06:57 GMT+0000 (Coordinated Universal Time)
పరారీలో వైసీపీ మాజీ ఎంపీ
బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు
బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంటిలో లేకపోవడంతో వెనుదిరగారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నందిగం సురేష్ ను నిందితుడిగా పోలీసులు చేర్చారు. అయితే ఆయన దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేయడంతో పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు.
ఇంట్లో లేకపోవడంతో...
కాని ఇంట్లో నందిగం సురేష్ లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెనురిరిగారు. మొన్నటి వరకూ ముందస్తు బెయిల్ పిటీషన్ పెండింగ్ లో ఉండటంతో నందిగం సురేష్, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి లతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ పిటీషన్ లు తిరస్కరించింది. మరో రెండు వారాలు చర్యలు తీసుకోవద్దంటూ వైసీపీ తరుపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కూడా హైకోర్టు తిరస్కరించింది.
Next Story