Sun Mar 15 2026 22:02:03 GMT+0530 (India Standard Time)
వల్లభనేని వంశీ విదేశాల్లో ఉన్నారా? హైదరాబాద్ లో లేరా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్ లో ఆయన ఉన్నారని తెలిసి మూడు ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వెళ్లాయి. అయితే ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగి వచ్చాయి. ఆయన విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని నిందితుడిగా పోలీసులు పెట్టారు. ఆయన కోసం గత రెండు రోజులుగా గాలిస్తున్నారు.
లుక్ అవుట్ నోటీసులు...
వల్లభనేని వంశీ అనుచరులను ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో మెండం రాంబాబు, అమరేంద్ర రెడ్డి, ఇమ్రాన్ లు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ మాత్రం ఆచూకి దొరకలేదు. అయితే ఆయనపై గతంలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, కానీ అంతకు ముందే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు అరెస్టయి జైలులో ఉండగా శనివారం మరికొందరిని అరెస్ట్ చేశారు.
Next Story

