Fri Jan 02 2026 06:31:19 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలానికి మద్యం బాటిళ్లు.. పోలీసులు స్వాధీనం
నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసులు మద్యాన్ని పట్టుకున్నారు

నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసులు మద్యాన్ని పట్టుకున్నారు. వాహనాల తనిఖీలలో బాగంగా పోలీసులకు 47 మద్యం క్వార్టర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్ పై మద్యం తెస్తూ నిందితులు పట్టుబడ్డారు. శ్రీశైలానికి మద్యం బాటిళ్లను తీసుకెళుతుండగా పట్టుకన్నాు.
ఇద్దరిపై కేసు నమోదు...
నిందితుల నుంచి 47 మద్యం బాటిళ్లు సీజ్ చేసిన పోలీసులు మాండ్ల కొలనుభరత్ గొళ్ల మాసయ్య లను శ్రీశైలం పోలీసులు అరెస్టు చేశార. ఆత్మకూరులో మద్యం కొనుగోలు చేసి శ్రీశైలంలో ఎక్కువరేటుకు అమ్మెందుకు మద్యం బాటళ్లను తెచ్చినట్లు సిఐ జీవన్ గంగనాధ బాబు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story

